సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు పట్టణ త్రీటౌన్ పోలీస్ వారు నెట్ వర్క్ చేసి, తక్కువ మొత్తం లో అమౌంట్ తీసుకొని ఎక్కువ మొత్తం లో డబ్బులు ఇస్తామని చెప్పి దొంగనోట్లు ముద్రించేముఠాను టను అరెస్ట్ చేశారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి డబ్బులు ఊరికే రావు అది అందరూ గమనించాలని ఏలూరు ఎస్పీ కోమ్మి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. మీకు 40 లక్షలు 30 లక్షలు ఇస్తామని చెప్పి మాకు మూడు లక్షలు ఇస్తే చాలు అని ఆశ చూపించి దొంగ నోట్ల వ్యాపారం చేసే ముఠాను పట్టుకున్నారు. సుమారుగా 40 లక్షల రూపాయల విలువైన దొంగనోట్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లు ముద్రనలో ఇంకొక వ్యక్తి ఉన్నారని త్వరలో అతనిని కూడా పట్టుకుంటాం. ప్రజలందరూ ఇటువంటి అపోహలకు గురికావద్దు. డబ్బులు ఎవరైనా ఊరికినే ఇస్తామని చెప్పినా, ఎక్కువ మొత్తంగా ఆశ చూపిన వెంటనే మా పోలీసులకు తెలియజేయలని ఏలూరు జిల్లా ఎస్పీ తెలిపారు…