సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రకృతిని, పర్యాయపరణాన్ని కాపాడాల్సిందే: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రభుత్వాలు ఏవైనా ప్రకృతిని పర్యాయపరణాన్ని కాపాడాల్సిందేనని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు మాకే నామ్ ఏక్ పెట్ , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ , జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో కలిసి ప్రారంభించారు . ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని అందరూ ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి వివాదాలు చేయకుండా ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రభుత్వ యంత్రాంగం అన్ని విభాగాల వారు పనిచేస్తున్నారని, మండలాల్లో గ్రామాల్లో విద్యాలయాల్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా టీం లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో అధికారులు కమిషనర్, డీఎంహెచ్ఓ, నాయకులు, లాలా మున్న, జోగు రవి, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, మయూర్ చంద్ర, రత్నాకర్ రెడ్డి ,విజయ్ తదితరులు ఉన్నారు