జాతీయస్థాయి క్రీడాకారులకు ప్రిన్స్ వహాబ్ ఆర్థిక సహాయం

జార్ఖండ్, అండమాన్ నికోబార్ జాతీయస్థాయి పోటీలో సత్తా చాటాలి

 సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఎమ్మిగనూరు పట్టణంలో జాతీయ స్థాయి ఎస్.జి.ఎఫ్ ఫుట్ బాల్ పోటీలలో ఎన్నికైన క్రీడాకారులు సత్తా చాటి ఎమ్మిగనూరు కు మంచి పేరు తేవాలని ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్ అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో వై.ఎఫ్.సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పట్టణానికి చెందిన మాచాని సోమప్ప బాలికల పాఠశాల విద్యార్థిని సౌమ్య ఎస్.జి.ఎఫ్ అండర్-14 ఫుట్ బాల్ జట్టుకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే పోటీలకు..దీక్ష కాలేజ్ విద్యార్థి ఈశ్వర్ ఎస్.జి.ఎఫ్ అండర్-17 ఫుట్ బాల్ జట్టుకు భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ ట్రాక్ షూట్, స్టడ్ షూస్, క్యాప్స్, స్టాకింగ్స్ లను ఉచితంగా అందజేశారు. అనంతరం ప్రిన్స్ వహాబ్ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని ఆర్థిక సహాయం అందించామన్నారు. అలాంటి వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు విజేతనాగరాజు, విశ్వనాథ్ రమేష్, సర్తాజ్, శేఖర్, ఓంకార్, రఘు, గుడికల్ వంశీ, పాలవీరేష్, తారక్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *