MLA Payal Shankar: సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు:  ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు:  ఎమ్మెల్యే పాయల్ శంకర్
ల‌బ్దిదారుల‌కు కళ్యాణ‌లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని , ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిన దళారులు మధ్యలో వచ్చిన నేరుగా ఈ విషయాన్ని తనకు తెలియజేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి 17, షాదీ ముబారక్ 58 చెక్కులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం లో ఈ కార్యాలయంలో నైనా అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు మీ పనిని చేయకుండా ఆపిన విషయాలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. నేను అందరి  పనిచేయడానికి ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *