ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్
సిరా న్యూస్,సిద్దిపేట;
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో జయశంకర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించిన పోలీస్ అధికారులు మరియు కమిషనర్ కార్యాలయ సిబ్బంది
ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, మాట్లాడుతూ.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయంకర్ గారు తెలంగాణ ఏర్పాటు విషయంలో అహర్నిశలు కృషి చేశారు, 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడని కొనియాడారు. నేటి యువత సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని సూచించారు సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఓ యాదమ్మ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, ప్రసాద్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సూపరిండెంట్లు ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, అనిషా,
ఎస్బి ఎఎస్ఐ పద్మారావు, మరియు కమిషనర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.