సిరాన్యూస్,నిర్మల్
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బిగ్ టీవీ , ,స్వప్న హాస్పిటల్, డాక్టర్ శశికాంత్ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరంలో ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రజల శ్రేయస్సు కోరి బిగ్ టివి యాజమాన్యం, మరియు స్వప్న హాస్పిటల్, డాక్టర్ శశికాంత్, ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు.స్వచ్చంద సంస్థలు, మీడియా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హెల్త్ చెకప్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.