సిరాన్యూస్,బేల
జీవితాన్నిఅంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ : ఎంపీడీవో నేర్ల మహేందర్
బేలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, తెలంగాణ ప్రజల సాధికారత కోసం తన జీవితాన్ని సైతం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ బేల ఎంపీడీవో నేర్ల మహేందర్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ జెమిల్ , మతీన్, కిరణ్, కిశోర్ , ఉపాధి హామీ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.