సిరాన్యూస్,కడెం
రాజశేఖర్‌ను సన్మానించిన బీజేపీ నాయకులు పొద్దుటూరు గోపాల్ రెడ్డి
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీ- నర్సయ్య కుమారుడు రాజశేఖర్ ఇటీవల ఆరు ప్రభుత్వ ఉద్యోగులు సాధించారు. మంగళవారం రాజశేఖర్‌ను బీజేపీ సీనియర్ నాయకులు పొద్దుటూరు గోపాల్ రెడ్డి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకుని ఆరు ఉద్యోగాల కు సెలెక్ట్ అవడం గొప్పవిషయం అని అన్నారు. కార్యక్రమంలో ఎలిగేటి వేంకటేశ్, దుర్గం రాజశేఖర్ , కే శంకర్ (మాజీ సర్పంచ్), ఇడుగురి ఆశన్, దుర్గం రఘు పాల్గొన్నారు.