ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హుస్నాబాద్;
గోపాల్ పూర్ లో స్వతంత్ర సమరయోధులు హుజురాబాద్ మాజీ శాసన సభ్యులు దుగ్గిరాల వెంకటరావు విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వతంత్ర సమరయోధులు సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం, ప్రజా స్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మాజీ శాసన సభ్యుడు దుగ్గిరాల వెంకటరావు ఘన నివాళులు. 34 సంవత్సరాల క్రితం స్వర్గస్తులైన దుగ్గిరాల వెంకటరావు అంటే మా బిడ్డ మా ఊరికి గర్వకారణం అని ఎంతోమంది అభిమానిస్తారు. దుగ్గిరాల వెంకటరావు సాధారణ జీవితంలో పోరాట రాజకీయాల్లో తన కంటూ ఒక ముద్ర వేసుకున్నారు. మా రాజకీయ గురువు చొక్కరావు, సత్యనారాయణ, వెంకట్రావు సమ కాలికులు ఆ తరానికి చెందిన నాయకులు నీతి నిజాయితీ గా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆనాడు ఉన్న ఆరా కోరా నిధులతో గొప్ప పనులు చేసిన మహానుభావులు. రైతాంగానికి సంబంధించి సమస్యలు, భూమి లేనీ నిరుపేదలకు భూములు పంచడం, కార్మిక కర్షకలోకానికి వారు చూపిన సేవ ఈతరానికి ఆదర్శం. మహానుభావుల విగ్రహాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి వారి నుండి మంచిని గ్రహించి నేటితరం దానిని సేకరించాలి. దేశం కోసం, సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం పోరాడిన నేతలు. మనం గొప్ప ప్రవర్తన తెచ్చుకొని వారిని స్ఫూర్తిగా తెచ్చుకోవాలి. ఇతరులకు ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలి. దుగ్గిరాల వెంకట్రావు చిరస్థాయిగా నిలిచారు. మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టలేదు, జిల్లాల పునః వ్యవస్థీకరణ సాంకేతికంగా ఉండాలని ప్రభుత్వం కమిటీ వేస్తుంది. దుగ్గిరాల విగ్రహ స్థాపన క కాదు. దుగ్గిరాల మండల సాధన కమిటీ అని పెట్టుకోవాలి మీ ఎమ్మెల్యే గా మంత్రిగా మీకు అండగా ఉంటా. 34 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ లో నిర్మించిన స్థూపం వద్ద గద్దర్ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నం. గ్రామాల్లో ఉన్న యువకులు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చకోవాలి. 100 ఉద్యోగాలకు 50 వేల అప్లికేషన్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ చేసిన 30 వేల జీతం వచ్చే పరిస్థితి లేదు. వృత్తి నైపుణ్యం పంచుకోండి. గతంలో ఎల్కతుర్తి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. భూస్వాములు ,నియంతృత్వం కి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర. మీ సమస్యల పై అండగా ఉంటా కొత్త బస్సులు వస్తున్నాయి. కొత్తగా ఉద్యోగాల నియామకం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం.