సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
మహాదేవ ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలో నూతనంగా మహాదేవ ఆసుపత్రి ని గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాంపూర్ మండల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.