తొమ్మిది మంది అరెస్టు
సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ లో వ్యభిచారం ముఠాలు చెలరేగిపోతున్నాయి.బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల వ్యభిచారానికి పాల్పడుతున్నారు నిర్వాహకులు. అల్వాల్ హిల్స్లో ఓ మసాజ్ సెంటర్ పై ఎస్ ఓ టి పోలీసులు దాడులు చేసారు. వెల్నెస్ స్పా సెంటర్లో వ్యభిచార నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు దాడి చేసారు. ఈ దాడుల్లో వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న 3 ఆర్గనైజర్లు, మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం, ఇమ్రాన్, సాయి, కిషన్, ముగ్గురు ఆర్గనైజర్లు వీరితోపాటు ఇద్దరు మహిళలు ముగ్గురు విటులు 2000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.