సిరా న్యూస్,తలమడుగు:
ప్రభుత్వంమే ఆదుకోవాలి.. ఆటో యూనియన్..
ఆటోలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న తమకు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ఎవరు తమ ఆటోలో రావట్లేదు . ఆదాయం లేక జీవనం కొనసాగించడం భారంగా మారిపోయిందని. ప్రభుత్వం వెంటనే ఆటో యూనియన్ సంఘాలకు సంక్షేమ నిది ఏర్పాటు చేయాలని కోరుతూ ఖోడద్ గ్రామంలో తాంసి, తలమడుగు మండలాల ఆటో యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.