సిరాన్యూస్, ఓదెల
రమ్య వివాహానికి సాయం చేసిన ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లి లో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన చిట్టవేన లక్ష్మీ కీ” శే” చంద్రయ్య యాదవ్ కూతురు రమ్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ సాయం అందజేశారు. ఈసందర్బంగా రమ్య వివాహానికి కావాల్సిన బియ్యం, పెళ్ళి చీర అందజేశారు. అనంతరం ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో జాపతి రాజేష్, రాజం కొమురయ్య, పర్శ తిరుపతి, నాంసాని గంగరాజు, గోరంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.