జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయ కార్యకలాపాలు ఇకనుంచి నూతన భవనంలో కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న నూతన భవనాన్ని కలెక్టర్ ప్రారంభించి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆ నూతన భవనంలోకి తరలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం తహసిల్దార్ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చడం జరిగిందని, ఇక నుంచి తహసిల్దార్, జాయిన్ సబ్ రిజిస్టర్ సేవలు నూతన భవనం నుంచి ప్రజలకు అందుబాటు లో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.