జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చీకురాయి రోడ్డు వద్ద ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ.ఎన్ .సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రిఫరల్ కెసులు, అవుట్ పేషంట్ వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిఫర్ చేసిన కేసులను ఫాలో అప్ చేయాలని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. ఔట్ పేషంట్ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారి డాక్టర్ స్వప్న, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
==========================