సిరా న్యూస్, ఆదిలాబాద్:
జైనథ్,బేలా మండలాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
అర్డిఓ కు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి వినతి…
ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్,బేల మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేక స్థానికంగా మండలం లో ఉన్న ప్రజలు యువత,విద్యార్థులు వివిధ అవసరాల నిమిత్తం అనేక ఇబ్బందులు పడుతున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి తెలిపారు.శనివారం ఆర్డిఓ స్రవంతికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనథ్,బేలా మండలాల నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి రావలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అందుకు జైనాథ్,బేలా మండల కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని కోరుతున్నామని వివరించారు. గ్యాస్ కనెక్షన్స్ కు ఈకే వైసీ అప్డేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ బోథ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పోతారెడ్డి,యువజన కాంగ్రెస్ బేల మండల వైస్ ప్రెసిడెంట్ విపిన్ టక్రే తదితరులు పాల్గొన్నారు.