-పదవ తరగతి, ఇంటర్లో చేరేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 10
-విద్యార్థులు, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
సిరా న్యూస్,మంథని;
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ మరియు ఇంటర్ చదవడానికి 2024-25 విద్యాసంవత్సరం కి గాను గురువారం నుండి అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ దొంతుల కుమార్ లు శుక్రవారం తెలిపారు.బడి మధ్యలో మానివేసిన వారికి మరియు 10వ తరగతి ఫెయిల్ ఐన 14 సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే అవకాశము ఉంటుంది. 15 సంవత్సరాలు నుండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ కోర్సు చదువుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు పలు వృత్తి వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు మరియు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇది ఒక సదా అవకాశము ఉంటుంది .సెలవు దినాలలో మాత్రమే తరగతులు నిర్వహించబడతాయి. ఇందుకుగాను ఈ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకోవడానికి అవకాశం కలదు. మరిన్ని
వివరాలకు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత 9290571599, అసిస్టెంట్ కోఆర్డినేటర్ దొంతుల కుమార్ రని 9959526990 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.