సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో..పటాన్చెరు మండలం, పటాన్చెరు డివిజన్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 271 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 2 కోట్ల 71 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.నిరుపేద ప్రజలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుందని ఎంఎల్ఏ తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మార్వోలు రంగారావు, సంగ్రం, లబ్ధిదారులు పాల్గోన్నారు.