సిరా న్యూస్,విశాఖపట్నం
విశాఖ సముద్ర తీరంలో ఓ ఫిషింగ్ బోట్ ముక్కలైంది. ఓ ఫిషింగ్ బోట్ అలలధాటికి కొట్టుకు పోయి రాళ్ళ మధ్య చిక్కుకుంది. మత్స్యకారులు దానిని తరలించేందుకు ప్రయత్నా లు చేస్తుండగానే.. అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. మత్స్యకారులు రోజూ వెళ్ళినట్టే ఉదయం బోట్ లో చేపల వేటకు వెళ్ళగా, ఇంజిన్ లో తలెత్తిన సాం కేతిక సమస్యలతో ఎటూ కదలక తీరానికి సమీపంలో నిలిచిపోయిం ది. మరమ్మత్తుల కోసం ఇతర బోట్ల సహాయంతో దానిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో లంగరు తెగి, అలల ధాటికి కొట్టుకుపోయి రాళ్ళ మధ్య చిక్కుకుంది. రాళ్ళ తాకిడికి బోట్ ముక్కలయ్యి సముద్రంలో మునిగి పోయింది. ప్రమాద సమయంలో బోట్ లోని మత్స్యకారులంతా సుర క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. విరిగిన బోట్ విలువ 20 లక్షలు ఉంటుందని, తమ ఉపాధి నాశనం అయిందని కన్నీళ్ళు పెట్టుకున్నారు
====