సిరాన్యూస్, బోథ్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి :ఎంపీడీవో జీవన్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీడీవో జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోథ్ మండలంలో స్వచ్ఛతనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కౌట (బి), పొచ్చెర గ్రామాలలో ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పొచ్చెర సబ్ సెంటర్లో మొక్కలు నాటిన అనంతరం ఎంపీడీవో జీవన్ రెడ్డి సమక్షంలో మండల పరిషత్ కార్యాలయంలో శ్రమదానం చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.