సిరాన్యూస్, తలమడుగు
పీఆర్టీయూటీజీతోనే సమస్యలు పరిష్కారం : జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్
* మండలంలో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు
పీఆర్టీయూటీజీతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ జడ్పీఎస్ఎస్, ఎంపీపీఎస్, బరంపూర్ ఎంపీపీఎస్, ఝరి ఎంపీయూపీఎస్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఝరిపునాగూడ, ఉమ్రి టి జడ్పీఎస్ఎస్ తలమడుగు పాఠశాలలో పీఆర్టీయూటీజీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా అధ్యక్ష ఆడే నూర్ సింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.