సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్‌లో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
సైదాపూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ వేడుకలను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసరి రఘుయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతియొక్క కార్యకర్త కృషి చేయాలని, యువజన కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పాటు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.