సిరాన్యూస్, ఓదెల
డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్‌కు ఘన సన్మానం
ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ ను సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వేములవాడ భవన నిర్మాణ కార్మికులు ఘనంగా సన్మానించారు. చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ తమిళనాడు లోని ఊటీ లో డాక్టరేట్ తీసుకున్నారు. ఈసందర్బంగా భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుంకపాక గంగారం మాట్లాడుతూ ఏగోలపు సదయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తు తను సంపాదించిన దాంట్లో నుండి కొంత పేదలకు సహాయం చేయడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు.ఆతను చేస్తున్న సేవలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గత సంవత్సరం డాక్టరేట్ పొందడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. అనంతరం డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ నేను భవన నిర్మాణ కార్మికుడిగా గత 25 సంవత్సరాల నుండి పని చేస్తున్నానని తెలిపారు. తోటి భవననిర్మాణ కార్మికుడిగా నేను గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి వేములవాడ భవన నిర్మాణ కార్మిక సంఘం సన్మానించినట్లు తెలిపారు. వారికి సదయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరీ అంజి, బండి శివ, కందూరి సత్యలింగం, ముల్కల భాస్కర్, కడపాల పరశురాం, లాల బాబు, కందూరి గణేష్, వడ్డేటి రవి, కందూరి చంద్రలింగం, సుంకపాక శ్రీనివాస్, దొబ్బల కిరణ్, మేడిపల్లి రవి,ఆరింద సింటు,అరేపల్లి హరీష్, పండుగ శంకర్ తదితరులు పాల్గొన్నారు.