సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఆగస్టు 15న కేపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం : మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్
* ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్రంలోనే మునుపేన్నాడు లేని విధంగా కె పి ఎల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఏర్పాటు చేసి డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడే విధంగా చేయడం చాలా గొప్ప విషయమని మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ అన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు గ్రౌండ్ పరిశీలించి మాట్లాడారు. ఆగస్ట్ 15 నుండి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ లో జరగబోయే కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ కేపీఎల్ సంబంధించి టోర్నమెంట్ ఇన్ ఛార్జ్ గోపి సూచన మేరకు గ్రౌండ్‌ను పరిశీలించామన్నారు. ఈకార్యక్రమంలో పవన్ యాదవ్ , ప్రకాష్ , ఐపార్శ పల్లి రఘు, అది, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.