సిరాన్యూస్,ఆదిలాబాద్
శభాష్… శుభాంగి.. ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ కు చెందిన బీజడ్ సి విద్యార్థిని శుభాంగి అగర్వాల్ సీపీ గెట్ పీజీ ఫలితాల్లో ఏకంగా ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించింది. రాసిన ప్రతి సబ్జెక్టులో ర్యాంకు తెచ్చుకుని అందరితో శభాష్ శుభాంగి అనిపించుకున్నది. వృక్షశాస్త్రం లో 6 వ ర్యాంకు హిందీ లో 25,జంతు శాస్త్రంలో 27,ఆంగ్లంలో 57,జర్నలిజం లో 107,ఆర్థిక శాస్త్రం లో 117,రసాయన శాస్త్రం లో 1713 ర్యాంకులు సాధించి ఔరా అనిపించింది. శుభాంగి ని, తండ్రి మనీశ్ చంద్ర అగర్వాల్ ను కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ జగ్రామ్ అంతర్వేది అధ్యాపకులు సంగీత, అరుణ్ కుమార్, శ్రావణి, సంతోష్ కుమార్, అష్రఫ్ అలీ, రాజ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, రమాకాంత్ తదితరులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు అభినందించారు.