సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పశువులు రోడ్లపై సంచరిస్తే తరలింపు తప్పదు: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రోడ్లపైన తిరుగుతూ వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. ఈసందర్భంగా రోడ్ల పైన తిరుగుతున్న ఆవులను రెండు రోజుల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉంచారు. పశువులను తీసుకెళ్లేందుకు మున్సిపాలిటీ తరఫున వెయ్యి రూపాయల జరిమానా, 20 రూపాయల బాండ్ పేపర్ పైన ఆవుల లెక్క యజమానుల సంతకం తీసుకొని విడిచిపెట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ వెయ్యి రూపాయల జరిమానా కట్టి తీసుకువెళ్లిన ఆవులు ఇంకా రోడ్ల పైన మిగిలిపోయిన ఆవులను మళ్లీ రోడ్లపైకి వదిలితే ఈసారి వెయ్యి రూపాయల జరిమానా కాకుండా వాటిని గోశాలకు లేదా వేలం పాట వేయడం జరుగుతుందని హెచ్చరించారు. పశు యజమానులు పశువులను ఇంటి వద్ద పెంచుకోవాలని సూచించాఉ. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ , కౌన్సిలర్లు ,నాయకులు నాయిని సంతోష్, నాయకులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.