సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ నగరంలోని కోట గల్లీలోని బాలికల (ఎస్సీ)సంక్షేమ హాస్టల్ లో మంగళవారం తెల్లవా రుజామున ఏసీబీ అధికారులు దాడులు ఆకస్మికంగా చేశారు. ఎస్సి వసతి గృహం లో తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగు తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున వసతి గృహంలో ఏసిబి అధికా రులు వివిధ శాఖల తో జాయింట్ ఆపరే షన్ చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారి, శాని టరీ ఇన్స్పెక్టర్, తూనికల కొలతల అధికా రుల ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతు న్నాయి. వసతి గృహం లోని రికార్డులను పరిశీలిస్తున్నారు.