సిరాన్యూస్, ఖానాపూర్
సదర్ మార్ట్ ఆయకట్ట నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మేడం పల్లి గ్రామంలో ఉన్నటువంటి సదర్ మార్ట్ ఆయకట్ట నుంచి మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా వర్షాకాల పంట పొలాల కోసం నీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులకు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.