సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్స్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు వ్యాపించి పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.