సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి ఝాన్వి కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఝాన్వి కపూర్, శిఖర్ పహరియాలతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా….ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాహ్నవీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ప్రతి సినిమా విడుదలకు ముందు ఝాన్వి కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీగా పెట్టుకుంది. అమ్మ శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో తిరుమలకు సోమవారం రాత్రి చేరుకొని., మంగళవారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టిఆర్ తో కలసి దేవర సినిమాలో కథానాయకిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే పాటలు విడుదల అయ్యి సందడి చేస్తున్నాయి. హిందీలో ఉలాజ్, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి కథానాయకిగా చిత్ర చిత్రీకరణ సాగుతోంది.