సిరాన్యూస్,భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి,గట్లనర్సింగాపూర్ గ్రామాలలో పలువురు లబ్ధిదారులకు మంగళవారం కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రెవెన్యూ అధికారులు,కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులునరసింహనాయక్,రాజు,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టంపల్లి ఐలయ్య,యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ, ఆదరి రవి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.