సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరామణారావు
రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని చింతకుంట విజయరామణారావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మండల కేంద్రం కే జి ఎన్ ఫంక్షన్ హల్ లో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ భారతదేశం లో తెలంగాణ ను మొదటి స్థానం నిలబెట్టిందన్నారు. ఈసమావేశంలో ఎంపీఓ గోవర్ధన్, ఇంచార్జి తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జి.సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎం డి మున్నీర్, మాజీ సర్పంచ్ లు, సతీష్ శంకర్, సత్యనారాయణ రెడ్డి, మండల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.