సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
మెనూ ప్రకారం భోజనం అందించాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్, స్కూల్ ను ఆకస్మిక తనిఖీ
విద్యార్థినులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జె కె నగర్, కాలనీలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే గర్ల్స్ స్కూల్ , హాస్టల్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి పౌష్టికాహార భోజనాన్ని మూడు పూటలు అందించాలని, కనీసం విద్యార్థుల తరగతి గదులలో ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు లేవని, విద్యార్థులు రాత్రి వేళలో దోమలలో పడుకుంటున్నారని, అపరిశుభ్రంగా హాస్టల్ గదులు ఉంటే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని మండిపడ్డారు. అనంతరం విద్యార్థులకు పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్లో వంట చేస్తున్న సిబ్బందిని, టీచర్స్ ను మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని హెచ్చరించారు. ఇలా చేస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ మండల నాయకులు కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.