సిరాన్యూస్,బోథ్
ఇంటికి వెళ్లి చెక్కులను అందించిన ఎమ్మెల్యే జాదవ్ అనిల్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామానికి చెందిన సకారం కుటుంబానికి మంజూరైన రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగళవారం బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ అందజేశారు. అంతేగాక బజార్హత్నూర్ మండలానికి చెందిన మోర్కండి గ్రామ నివాసి నాగరాణి కి మంజూరైన రూ.42 వేల చెక్కును అందించారు.మరికొంత మందికి ఎమ్మెల్యే స్వగృహంలో చెక్కులను అందించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి వారి ఇండ్లకు వెళ్లి అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తపరుస్తున్నారు.