సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
* ప్రభుత్వ దవాఖాన ఆకస్మిక తనిఖీ
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాను మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ కి వచ్చే ప్రజలకు సరైన వైద్యం అందించడం లేదని, హాస్పిటల్లోని మెడికల్ ల్యాబ్ లో ఉన్నటువంటి మందులను, బాలింతలకు అందించే భోజనాన్ని పరిశీలించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని మెన్యూ ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు అధికారులను సిబ్బందిని హెచ్చరించారు. హాస్పిటల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , మండల అధ్యక్షులు దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , కౌన్సిలర్ నాయకులు అమానుల్లా ఖాన్ , తోట సత్యం , రాజేందర్ ,పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.