సిరాన్యూస్,కడెం
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రైతు వేదికలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.