సిరాన్యూస్, ఓదెల:
బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి: బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
* ఈనెల 20న బీసీ సదస్సు
* బీసీ సదస్సు పోస్టర్ విడుదల
బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ నాయకురాలు దాసరి ఉష అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని ఎంబి గార్డెన్ లో బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీసీల కుల గణన చేయాలని బీసీ నాయకులందరూ ఒకే వేదిక పైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా బీసీలు ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులదరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 న,పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్లో జరుగు బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో బీసీలు హాజరై సదస్సును విజయం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, కేశవ్ రామ్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి ,మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ , మాజీ ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్ జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తదితరుల పాల్గొన్నారు.