ఆటల తో అస్వస్థకు గురయ్యారన్న సిబ్బంది
టెస్టులకు పంపించిన డాక్టర్లు
సిరా న్యూస్,జగిత్యాల;
గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధిత నేతలతో కలిసి జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలలో పరిశీలించిన కొన్ని గంటల్లోనే మరో పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల చెందిన శ్రీజ, రిశీత, శ్రావ్య, భవ్యశ్రీ, అమిత అనే విద్యార్థులు 15 ఆగస్టు కోసం క్రీడా పోటీలలో పాల్గొని అస్వస్థతకు గురయ్యారని పాఠశాల సిబ్బంది చెప్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఫుడ్ పాయిజన్ జరగడంతోటే అస్వస్థతకు గురయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో విచారణ నేపథ్యంలో నమూనాలను టెస్టులకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు జరిగిన ఘటనపై ప్రభుత్వ అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.