సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకులం పై నుండి కింద పడిన బాలిక కిందపడింది.గురుకులం మూడవ అంతస్తు నుంచి కోయడ కార్తీక శ్రీ ఒక్కసారిగా కిందపడిగా గురుకుల యాజమాన్యం ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ములుగు ఏరియా అస్పత్రికి తరలించారు ఐతే కార్తీక శ్రీ పరిస్థితి విషయంగా ఉండటంతో హుటాహుటిన వరంగల్ ఎంజియం ఆస్పత్రికి తరిలించారు.బాలిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులంలో ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుతుంది. గురుకుల టీచర్స్ మాత్రం అమ్మాయి మానసిక పరిస్థితి బాగోలేదని దానివల్లే ప్రమాదం జరిగినట్టు తెలుపుతున్నారు.బిల్డింగ్ పై నుంచి అమ్మాయి అదుపు తప్పి పడిందా, ఎవరైనా తోసారా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే పలు అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు