సిరాన్యూస్, ఉట్నూర్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను సన్మానించిన వడగల్పూర్ (కే)పటేల్‌లు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని వడగల్పూర్ (కే) గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈసందర్బంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను వడగల్పూర్-(కే) నూతన గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల పటేల్‌లు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ధనసరీ సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో గ్రామపటేల్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.