సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో సినీ నటుడు విక్రమ్ సంద డి చేశారు. తంగలాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాళవిక మో హనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మీడియా సమావేశం నిర్వహించా రు. హీరో విక్రమ్ తంగలాన్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమ య్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సిని మాని పా. రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోం ది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు.