విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి

-కన్నాల విద్యార్థులకు టీ షర్ట్స్, డ్రమ్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు
-పాల్గొన్న మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమా సురేష్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి చదువుతున్న పాఠశాలకు, గ్రామానికి, ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మంథని మండలం కన్నాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీషర్ట్స్, పాఠశాలకి డ్రమ్స్ ను పాఠశాల పూర్వ విద్యార్థులు పంపిణీ చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు నలమాసు, హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. సుమారు 65 మంది విద్యార్థులకు అవసరం అయినా స్కూల్ పేరుతో ప్రింట్ అయిన టీ షర్ట్ లు కన్నాలకు చెందిన కావటి భూమయ్య కూతురు పాఠశాల పూర్వ విద్యార్థిని బోయిని స్వరూప-సమ్మయ్య (సింగపూర్) లు డొనేట్ చేశారు అలాగే పాఠశాల పూర్వ విద్యార్థులు పెండ్రు సుమంత్ రెడ్డి, గుడిసె కేవల్, ఉడుత శ్రీనివాస్, బుదారపు సతీష్ లు డ్రమ్స్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తలుగా కన్నాల పూర్వ విద్యార్థి కావటి సందీప్ , ఎగ్లాస్పూర్ జెడ్పి పాఠశాల పిడి డాక్టర్ దొమ్మటి రవి లు వ్యవహరించారు. అనంతరం ఉపాద్యాయులు,పూర్వ విద్యార్థులు చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొయిల రాజయ్య లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఏపీ రాజు, రాధిక, సావిత్రి, శ్రీలత, వెంకటేశ్వర్లు, సంపత్ లతో పాటు ప్రాథమిక పాఠశాల హెచ్.ఎం. మధు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *