సిరా న్యూస్,గన్నవరం;
ఉంగుటూరు మండలం అత్కుర్ గ్రామంలో విషాదం నెలకొంది. నాలుగవ తరగతి చువుతున్న అక్కినేని మానస అనే విద్యార్థిని ఆడుకుంటూ ఇంటి ఎదురుగా ఉన్న కోనేరు చెరువు లో ప్రమాదపు శాత్తు పడి మృతి చెందింది. గురువారం నిన్న సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన మానస అడుకుంటానికి అని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు ఆత్కుర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. రాత్రీ అంత వెతికినా మానస ఆచూకీ లభించలేదు. ఉదయం ఇంటి ఎదురుగా ఉన్న కోనేరు చెరువులో మృత దేహం తేలి ఉండటం తో శోకసంద్రంలో కుటుంబ సభ్యులుమునిగిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసారు.