సిరా న్యూస్,కాకినాడ;
స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారి పవన్ కళ్యాణ్ యాంకర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తొలిసారిగా అధికారికం గా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయన ఒకరే మంత్రి. దీంతో కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను వివరిస్తూ ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి సేవా పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ,సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ షామ్ మోహన్ సగిలి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు