సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..

 సిరా న్యూస్,ఖమ్మం;
అశ్వాపురం మండలంలోని గురువారం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ఫేస్ వన్ లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపు హౌస్ ఫేస్ వన్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.అనంతరం పంప్ హౌస్ ను పరిశీలించి పూజలు చేసి సీతారామ నీటి పరవళ్లను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమని ఎప్పుడూ ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనే సాధ్యమని పరిపాలనలో రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు.
ఈ సీతారామ కెనాల్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని దీని ద్వారా ఖమ్మం జిల్లా అంతటా పంటలతో సస్యశ్యామలమవుతుందని అన్నారు. అనుకున్నదే తడవుగా రాష్ట్రమంతటా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు పథకాలని ప్రారంభించి ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజలందరికీ సుభిక్షమైన పరిపాలనందిస్తామని అన్నారు. అనంతరం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రికి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ పటేల్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *