సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉమేష్ రావ్‌ను పరామర్శించిన ఎన్రాల నగేష్
ప్రముఖ న్యాయవాది, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉమేష్ రావ్ డోలేను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేష్ ఇంటికి ఆయన స్వయంగా వెళ్లి, ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెల్సుకున్నారు. పంద్రాగస్ట్ వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికేట్ పోటీల్లో న్యాయవాదులు గెలవడంతో, గురువారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర రావు , ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కప్ అందించి, అభినందించారు. అయితే క్రికేట్ పోటీల్లో పాల్గొన్నప్పటికీ కూడ అనారోగ్యంతో వేడుకలను హాజరు కాలేని ఉమేష్ రావ్ వద్దకు ఎన్రాల నగేష్ కప్‌తో స్వయంగా వెళ్లి, అభినందించారు. గెలుపులో ఉమేష్ రావ్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. త్వరగా కోలుకొని, యథావిధిగా కోర్టుకు హాజరు కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట న్యాయవాది అఖిలేష్, తదితరులు ఉన్నారు.