సిరాన్యూస్,ఓదెల
ఓదెలలో బంద్ విజయవంతం
బంగ్లాదేశ్ లో హిందువుల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో హిందూ వాహిని వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈసందర్బంగా ఓదెల గ్రామంలోని విద్యాలయాలు, వివిధ దుకాణ సముదాయాలు, హోటల్లు బట్టల దుకాణాలు, చికెన్ సెంటర్లు బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగా హిందూ వాహిని కార్యకర్తలు మాట్లాడుతూ హిందువులపై హత్యలు, అత్యాచారాలు జరగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతాల కుమార్, మేకల సత్యం, అనిల్, శ్యామ్, వంగరి చందు, తీర్థాల కుమార్, దాత రాకేష్, మధు, అశోక్, రామినేనిరాజు, సాయి, శ్రీకాంత్, సురేష్, రామగిరి కృష్ణా, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.