సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్‌లో బంద్ విజయవంతం
బంగ్లాదేశ్ లో హిందువుల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈసందర్బంగా మండలంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, హోటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ మాట్లాడారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు.బంద్‌కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, చల్లచంద్రమౌళి, పూరెల్లదిలీప్, రామన్న, వెంకటేశ్వర్లు, శివ, దంతనపల్లికృష్ణ, లక్ష్మణ్, శ్రావణ్, మల్యాలరమేష్, ముస్కుసంపత్, కారుపాకలశంకర్, దాసరికృష్ణ, తాతరాజు, పంజలసతీష్, ఉల్లిరమేష్, బంగారిసతీష్, ముస్కువిజయ్, శ్రీకాంత్, తదితర హిందూ సంస్థల నాయకులు పాల్గొన్నారు.