సిరా న్యూస్,కాకినాడ;
ఐదు సంవత్సరాల తరువాత పేదల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హర్షం వ్యక్తం చేశారు. ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను నాడు వైసిపి ప్రభుత్వం ఎత్తివెయడంతో పేదలు ఆకలి కేకలకు గురయ్యారు అన్నారు. నేటి నుంచి ఆకలి అనే పదం వినపడుదు అన్నారు.
శుక్రవారం కాకినాడలోని పలు సెంటర్లలో అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే కొండబాబు నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిపి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారని తెలియడంతో ఉదయాన్నే అల్పాహారం కోసం పెద్ద ఎత్తున పేదలు అక్కడికి తరలివచ్చారు .వారితో కలిపి ఎమ్మెల్యే అల్పాహారం చేసారు. ఇకనుంచి రాష్ట్రంలో ఆకలి కేకలు ఉండవని ,పేదల జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.