కడలి తరంగాల్లా కదలి వచ్చిన భక్తులు
చక్కటి ఏర్పాట్లు
సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో బ్రహ్మ గుడి ఆలయంవద్ద శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఉపవాస నియమనిష్ఠలతో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆలయమంతా మామిడి తోరణాలు, పూల తోరణాలు, అరటి చెట్లతో చక్కగా ముస్తాబు చేశారు వేద పండితులు అర్ధగిరి, అర్చకులు కరుణాకర్ గురుకుల్, వేద పండితులు ఆధ్వర్యంలో వ్రతం మహత్యంలోనూ పఠిస్తుండగా శాస్రోక్తంగా మహిళలు వరలక్ష్మి పూజలు నిర్వహించారు మొదటి విడత పూజల్లో ఆలయ ఈవో ఎస్ ఎన్ వి ఎస్ మూర్తి కుటుంబ సభ్యులతోపూజల్లో పాల్గొన్నారు అదేవిదంగా డిప్యూటీఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి వరలక్ష్మి పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు